వస్త్ర వ్యాపారులకు అశ్వారావు పేట ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మద్దతు

అశ్వారావుపేట: వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత 8రోజులుగా వస్త్ర వ్యాపారులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా అశ్వారావుపేట ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారులు. అన్ని రకాల వర్తక , వాణిజ్య ప్రముఖులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాలడుగు సుబ్బారావు పాల్గొన్నారు.