వాంటెడ్‌ జాబితాలో మావోయిస్టు అగ్రనేతలు

హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేతలు గణపతి, నంబాల కేశవరావులను వాంటెడ్‌ జాబితాలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ చేర్చింది. బలిమెల ఘటన, ఆయుధాల రవాణా కేసుల్లో నంబాల కేశవరావును ఈ జాబితాలో చేర్చినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.