వాచీల దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ : పంజాగుట్టలోని కమల్‌ వాచీ దుకానంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దుకానంలో నుంచి రూ.1.45 కోట్ల విలువైన వాచీలను దొంగిలించారనే ఆరోపణలపై ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు బీహార్‌ రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.