వాన్‌పిక్‌పై ఈడీ పిటిషన్‌కు కోర్టు అనుమతి

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌కు సీబీఐ కోర్టు అనుమతించింది.వాన్‌పిక్‌ ఛార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాల కోసం సీబీఐ కోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం అనుమతినిచ్చింది. దీంతో ఈడీ జగన్‌ అక్రమాస్తులకేసులో వాన్‌పిక్‌ కుట్రపై దృష్టి పెట్టనుంది. ఈ వ్యవహారంలో మోపిదేవి, ధర్మానను ఈడీ ప్రశ్నించనుంది. జగన్‌ను కూడా మరోసారి ప్రశ్నించే యోచనలో ఈడీ ఉన్నట్లు తెలియవచ్చింది. ఈకేసుకు సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానరదరెడ్డిలను ఈడీ అధికారులు ఇదివరకే విచారించారు.