వాసిరెడ్డి జీవితం పాత్రికేయులకు ఆదర్శం

హైదరాబాద్‌ : రైతుల అభ్యుదయానికి, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసిన వ్యక్తి వాసిరెడ్డి సత్యనారాయణ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. పాత్రికేయుడిగా, ఈనాడు డైరెక్టర్‌గా పనిచేసే ఈనెల 22న విజయవాడలో మృతిచెందిన వాసిరెడ్డి సత్యనారాయణ సంస్మరణ సభలో రాఘవులు పాల్గొన్నారు. నగరంలోని అమ్మ కల్యాణ మండపంలో జరిగిన సంస్మరణ సభలో పాత్రికేయుడిగా వాసిరెడ్డి నిజాయితీని, నిబద్ధతను కొనియాడారు. వాసిరెడ్డితో తనకు 28 సంవత్సరాల అనుబంధం ఉందని ఈనాడు జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఎం.నాగేశ్వరరావు అన్నారు. మహోన్నత గుణాలు ఉన్న వాసిరెడ్డి ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి అన్నారు. దశాబ్దాల క్రితమే ఉన్నత పదవులు పొంది… నికార్సైన పాత్రికేయ విలువలు ఉన్న వాసిరెడ్డి ఆదర్శప్రాయడని కొనియాడారు.