వాహనం దూసుకెళ్లి ఇద్దరి మృతి

తాండురు : రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలోని గౌతారంలో పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ నిబంధనల బోర్డును ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు యువకులు కిందపడ్డారు. అదే సమయంలో వీరిపై గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.