విఆర్ఎ ల ఆధ్వర్యంలో పే స్కేల్ జాతర.
వీఆర్ఏలకు పేస్కేల్,ప్రమోషన్లు కల్పించాలి.
రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ సెక్రెటరీ జనరల్
ఎస్కే దాదేమియ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 22(జనంసాక్షి):
రాష్ట్ర విఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు వీఆర్ఏ నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పే స్కేల్ జాతర నిర్వహించడం జరిగింది. గాంధీ పార్క్ నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై మండలాల వీఆర్ఏలు బోనాలు బతుకమ్మ పోతురాజు డీజే డప్పులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విఆర్ఏ జేఏసీ సెక్రటరీ జనరల్ ఎస్కే దాదా మియా మరియు నాగర్ కర్నూల్ జిల్లా విఆర్ఏ జేఏసీ చైర్మన్ ఆర్ విజయ్ కో చైర్మన్ శంకర్ సెక్రటరీ జనరల్ కే అంజనేయులు మరియు కో కన్వీనర్ లు ప్రసన్న కాజా భాను శోభారాణి భాస్కర్ నాగరాజు రాధా బంగారు వివిధ మండలాల జేఏసీ చైర్మన్లు మరియు సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసరావు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల రామయ్య కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న 20 మండలాల వీఆర్ఏలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వీఆర్ఏసి జేఏసీ సెక్రెటరీ జనరల్
ఎస్కే దాదేమియ మాట్లాడుతూ కెసిఆర్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినటు వంటి వీఆర్ఏలకు పేస్కేల్ ప్రమోషన్లు వారసులకు ఉద్యోగాలు మరణించిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ఎలాంటి బేసాజాలకు పోకుండా వెంటనే ప్రమోషన్లు వారసులకు ఉద్యోగాలు జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.