వికటించిన సూదిమందు

ఆసుపత్రి ఎదుట మృతిడి బంధువుల ఆందోళన
మంచిర్యాలటౌన్‌ , జనంసాక్షి : మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సూదిమందు (ఇంజక్షన్‌) వికటించడంతో పడిగెల తిరుపతి మృతిచెందారని ఆరోపిస్తూ శనివారం ఆయన బంధువులు ఆస్పత్రి ముందు రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా తిరుపతి కుటుంబ సభ్యులు మాట్లాడతూ మందమర్రి మండలంలోని కె.కె-2 ఇంక్లెన్‌ ఏరియాలో గత మంగళవారం వరిపోలంతో మందులు (రసాయన ఎరువులు) చల్లుతూ అస్వస్థతకు గురికావడంతో అదే రోజు రాత్రి మంచిర్యాల ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆరోగ్యం కొంత కుదుట పడటంతో శనివారం ఇంటికి పంపిస్తామని,సూదిమందు తీసుకొని వెళ్లమని వైద్యుడు చెప్పారని తిరుపతి భార్య లక్ష్మీ తెలిపింది. తన భర్తకు సూదిమందు వేసిన కొద్ది క్షణాల్లోనే మృతిచెందారని ఆరోపించింది. సూదిమందు వికటించే తన భర్త మృతిచెందాడని రోదిస్తూ తెలిపింది. తిరుపతి పెద్ద కూతురు అశ్వినికి 20న పెళ్లి నిశ్చయమైందని తెలిపారు. ఈ విషయమైన మంచిర్యాల ఆసుపత్రి పర్యవేక్షకుడు వైద్యుడు అరవింద్‌ మాట్లాడుతూ తిరుపతి మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని పేర్కొన్నారు. విషరసాయనాల (ఫైజన్‌ కేసు) కు సంబంధించిన విషయంలో మనిషి శరీరంలో వారం పది రోజుల తర్వాత కూడా విష ప్రభావం చూపుతుందన్నారు. సూదిమందు ఇవ్వడం వల్లనే తిరుపతి మృతిచెందాడని ఆరోపించడం సరికాదన్నారు.