‘వికారాబాద్’ క్షతగాత్రుల్లో మరొకరి మృతి
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్ రాజీవ్ గృహకల్ప కాలనీలో శుక్రవారం జరిగిన పేలుడు దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏసు అనే వ్యక్తి మృతి చెందాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో మహిళ అస్మానజిల్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.



