విజయనగరం ఘర్షణలో ఇద్దరు మృతి
విజయనగరం, నవంబర్ 27 : జిల్లాలోని గరివిడి మండలంలొ గొల్లపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. దీంతో మరలా పాత పరిస్థితులు పునరావృతం కాకుండా ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో పోలీసు బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లాలోని గరివిడి మండలంలొ గొల్లపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. దీంతో మరలా పాత పరిస్థితులు పునరావృతం కాకుండా ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో పోలీసు బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.



