విజయవాడలో భారీ దొంగతనం
ఆటోనగర్ (విజవాడ) : బందరురోడ్డు అశోక్‌నగర్‌లోని ధనేకులవారి వీధిలో దొంగలు పడి ఒక ఇంట్లో 35 కాసుల బంగారం, మూడున్నర కేజీల వెండి దొంగించారు. తుమ్మల హరిబాబు అనే టెలికాం మాజీ ఉద్యోగి తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి, రాత్రి అక్కడే ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని విషయం గమినించిన దొంగలు ఇనుప చువ్వలతో తాళం పగలకొట్టి బీరువాలోని బంగారం, వెండితోపాటు 600 అమెరికాన్ డాలర్లును అపహరించారు బాధితుడి ఫిర్యాదు మేరకు పడమటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


