విజయవాడలో సందడి చేసిన ఎన్టీఆర్‌

విజయవాడ : మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ నిర్వహిస్తున్న బ్రైడ్స్‌ ఆఫ్‌ ఇండియా నగల ఫెస్టివల్‌ సీజన్‌-3 ప్రివ్యూ కోసం ఆ సంస్థ ప్రచారకర్త, సినీ నటుడు నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ విజయవాడకు వచ్చారు. మహాత్మగాంధీ రోడ్డులోని గేట్‌ వే హోటల్‌ వద్ద అభిమానులకు అభివాదం చేస్తూ సందడిగా గడిపారు. ఎన్టీఆర్‌ను చుసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.