విజయవాడ – విశాఖ ప్యాసింజర్‌ రైలు రద్దు

హైదరాబాద్‌ : విజయవాడ – విశాఖ ప్యాసింజర్‌ రైలు నేటి నుంచి డిసెంబర్‌ 3 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. సాంకేతిక కారణాలతో ఈ రైలును రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.