విఠల్‌రెడ్డి మృతిపట్ల కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: సీపీఐ కురు వృద్ధుడు. పేదల పక్షపాతి, మాజీ ఎమ్మెల్యే చిలుముల విఠల్‌రెడ్డి (98) మృతిపట్ల టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నర్సాపూర్ నియోజక వర్గం నుంచి విఠల్‌రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. విఠల్‌రెడ్డి అంతక్రియలు ఇవాళ ఆయన స్వగ్రామం నర్సాపూర్‌లో నిర్వహించనున్నారు. విఠల్‌రెడ్డి మృతి తెలంగాణకు తీరనిలోటు అని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ పలువురు టీఆర్‌ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.



