విద్యార్థిని చితకబాదిన ప్రిన్నిపల్‌ అరెస్టు

అమీర్‌పేట : ఎల్‌కేజీ యదువుతున్న చిన్నారిని విచక్షణారహితంగా కొట్టిన ప్రిన్సిపల్‌ను సనత్‌నగర్‌ పోలీసులు ఈరోజు చేశారు.ఫతేనగర్‌ ఆర్బిట్‌ గ్రామర్‌ స్కూల్‌లో మహ్మద్‌గౌన్‌ అనే 5ఏళ్ల విద్యార్థి ఎల్‌కేజీ చదువుతున్నాడు. తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నాడనే నెపంతో కర్రతో శరీరంపై వాతలు తేలేలా చిన్నారి ప్రిన్సినల్‌ చితకబాదాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.