విద్యార్థి అదృశ్యం

చిన్నఎల్లాపురం(గూడూరు),జనంసాక్షి: మండలంలోని చిన్నఎల్లాపురం శివారు బీషకోపల్‌ లైన్‌తండాకు చెందిన బానోత్‌ కృష్ణ్రానాయక్‌ కళాశాలకు వెళ్లి అదృశ్యమైనట్లు తండ్రి బాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్‌ఐ హన్నన్‌ కథనం ప్రకారం కృష్ణ్రానాయక్‌ ఖమ్మంలోని వాగ్దేవి కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దసరా పండుగకు వచ్చిన కృష్ణ్రానాయక్‌ కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటినుంచి వెళ్లిపోయాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి రాకపోవటంతో తండ్రి బాలు కళాశాలకు ఫోన్‌చేసి కృష్ణ్రానాయక్‌ గురించి అడిగాడు. దసర పండుగకు 20 రోజుల ముందు తిరిగి రాలేదని కళాశాలవారు తెలపటంతో బాలు మంగళవారం రాత్రి కుమారుడు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎన్‌ఐ తెలిపారు.