విద్యార్థి చేయి విరగ్గొట్టిన ఉపాధ్యాయురాలు

కాకినాడ : ఉపాధ్యాయురాలు విద్యార్థి చేయి విరగ్గొట్టిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ఇంద్రపాలెం ఉషామెరిట్‌ పాఠశాలలో చోటుచేసుకుంది. ఇంటిపని చేయనందుకు ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిని తీవ్రంగా దండించింది. చేయిపై బలంగా కొట్టింది. దీంతో విద్యార్థి చేయి విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.