విద్యార్థులు నేతలపై ఒత్తిడి తీసుకురావాలి : లగడపాటి
విజయవాడ : తెలంగాణ పై జరగనున్న అఖిలపక్ష భేటీలో సమైఖ్యాంధ్ర వాదన వినిపించే విధంగా నేతలపై విద్యార్థులు ఒత్తిడి తీసుకురావాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన సమైఖ్యాంధ్ర జేఏసీ నిర్వహించిన సమావేశానికి లగడపాటి హాజరయ్యారు. జిల్లాలో పర్యటనలకు వచ్చే నేతలను ఈ విషయంపై నిలదీయాలని.. రాష్ట్రం విడిపోకుండా చూడాలని కోరారు.