విద్యార్థుల బస్‌పాస్ ఛార్జీల పెంపు
హైదరాబాద్ : విద్యార్థుల బస్‌పాస్ ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఎండీ ఎ.కే. ఖాన్ సంకేతాలు ఇచ్చారు. ఇరవయ్యేళ్లుగా విద్యార్థుల బస్‌పాస్ ఛర్జీలు పెంచలేదని, ప్రస్తుతం పెంచక తప్పదనిపిస్తోందని ఆయన అన్నారు. విద్యార్థుల బస్‌పాస్‌పై రాయితీ 90 శాతానికి చేరుకుందన్నారు. 2012-13 లో ఆర్టీసీ నష్టం రూ. 330 కోట్లకు తగ్గిందని ఖాన్ పేర్కొన్నారు.


