విద్యార్ధి కవాతు 30కి వాయిదా
హైదరాబాద్: టీఎస్‌జీవో భవన్‌లో ఈరోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో తెలంగాణ కవాతుపై చర్చించనున్నట్లు రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం తెలియజేశారు. తెలంగాణ కవాతుపై చర్చించేందుకు ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు చర్చలకు రావాలని హోంమంత్రి ఆహ్వానించినట్లు ఆయన వివరించారు. కవాతు విషయంలో తామంతా ఐక్యంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థి ఐకాస నేతలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 27న తల పెట్టిన విద్యార్ధి కవాతును 30కి వాయిదా వేసినట్లు విద్యార్ధి ఐకాస నేతలు తెలియజేశారు.



