విద్యుత్కేంద్రం రియాక్టర్‌ గొట్టంలో బీటలు

బ్రస్సెల్స్‌: బెల్జియంలోని మరో అణు విద్యుత్కేంద్రం రియాక్టర్‌ గొట్టంలో బీటలు గుర్తించినట్లు విద్యుదుత్పత్తి సంస్థ ఎలక్ట్రాబెల్‌ పేర్కొంది. జనవరిలో డియోల్‌ 3 లోని రియాక్టర్‌ గొటంలో తలెత్తిన సమస్యే తిహంగే 2లోనూ గర్తించామని సంస్థ ప్రతినిధి జీడీఎఫ్‌ సూయెజ్‌ తెలిపారు. డయోల్‌ సమస్య వెలుగు చూసిన అనంతరం ఇక్కడా తనిఖీలు ప్రారంభించారు. ప్రస్తుతానికి తిహంగే 2లో ఉత్పత్తిని నిలిపివేశం అని సంస్థ అధికారప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.