విద్యుత్తు సంక్షోభానికి తొలి ముద్దాయి వైఎస్‌: అరవింద్‌కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర్లంలో విద్యుత్తు సంక్షోభానికి తోలి ముద్దాయి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డేనని తెదేపా ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు. 2004నుంచి 2009 మధ్యకాలంలో వైఎస్‌ విద్యుత్తు వ్యవస్థను పతనావస్థకు తీసుకొచ్చారని మండి పడ్డారు. పాదయాత్రలో భాగంగా ప్రజల కరెంటు సమస్యలు తెలుసుకుంటున్న షర్మిళ దానికి కారకులెవరో కూడా చెప్తే బాగుంటుందన్నారు. తన తండ్రి వైఎస్‌ హయంలో ఏ మేరకు విద్యుత్తు ఉత్పత్తి జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 2004 నుంచి 2009 మధ్య జరిగిన బొగ్గు కొనుగోళ్లు, ఉత్పత్తిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని అరవింద్‌కుమార్‌గౌడ్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు.