విద్యుత్‌కోతలపై ముఖ్యమంత్రి రామచంద్రయ్య లేఖ
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్తు కోత పరిస్థితులపై తక్షణ చర్యలు అవసరమంటూ రాష్ట్రంలో పరిశ్రమలు ఖాయిలా పడుతున్నాయని దీనివల్ల ఆర్థికాభివృద్థికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని వివరించారు. తెలంగాణ. రాయలసీమ మెట్ట ప్రాంతాల్లో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని పరిశ్రమలు తీవ్ర నష్టాల్లో మునిగిపోయాయని వెల్లడించారు. కృష్ణా బేసిన్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల జల విద్యుదుత్పత్తి పూర్తిగా కుంటుపడిందన్నారు. గ్యాస్ కొరత వల్ల గ్యాస్ ఆధారిత విద్యుత్తు కేంద్రాలు తమ సామర్థ్యం కంటె 30 శాతం కూడా విద్యుత్తు ఉత్పత్తి చేయలేకపోతున్నాయన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుంటే జలవిద్యుత్ లభ్యత ఉండదని దీనివల్ల గ్యాస్ ఆధారిత విద్యుత్తు కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రస్తుత విద్యుత్తు సంక్షోభ పరిస్థితి నుంచి గట్టేక్కుందుకు మంత్రి ఆరు అంశాలను సీఎం ముందుంచారు.



