విద్యుత్‌ ఛార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్దమవుతున్న వామపక్షాలు

 

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు వామపక్షాలు స్ధిమవుతున్నాయి. వేలకోట్ల రూపాయాల విద్యుత్‌ భారాన్ని ప్రజలపై మోపుతున్న ప్రభుత్వాన్ని ప్రజల సమక్షంలోనే నిలదీస్తామంటున్నాయి. లెప్ట్‌ పార్టీలు రాష్ట్రంలోని ప్రతి మండలంలో సదస్సుల ఏర్పాటు ద్వారా ఛార్జీల పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రజలకు వివరిస్తామని పీపీఏం,సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తెలిపారు.