విద్యుత్‌ సంక్షోభానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణము

కర్నూలు: రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన కర్నూల్‌ జిల్లా గూడురులో పర్యటించారు. పట్టణంలో ఆయన మాట్లాడుతూ వృద్దులను ఆదుకునేందుకు అవసమైతే ప్రతి నియోజక వర్గంలో వృధ్దాశ్రమం ఏర్పాటు చేస్తామన్నారు. రూ.లక్ష చోప్పున ఖర్చు పెట్టి పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణాలు మాపి చేస్తామని అన్నారు.