విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమిస్తాం :

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్ర ఇంధనశాఖాదికారి ఏఎన్‌ భక్షి అన్నారు. విద్యుత్‌ సౌధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్‌ సంక్షోభం అధికంగా ఉందన్నారు. వర్షాలు లేకపోవడం ,గ్యాస్‌ అనుకున్నంత లభ్యం కాకపోవడం వంటి తదితర కారణాలతో విద్యుత్‌ ఉత్పత్తి పడిపోయిందని ఆయన పేర్కొన్నారు.