వినుకొండలో ‘మనగుడి’

వినుకొండ, ఆగస్టు 3 : దేవాలయాల్లో మనగుడి కార్యక్రమం భక్తులు భక్తీ శ్రద్ధలతో నిర్వహించారు. వినుకొండ పట్టణానికి ప్రసిద్ధి చెందిన ప్రసన్నరామలింగేశ్వర కోదండరామస్వామి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి పూజలు, భజనలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కంకణాలు, కుంకుమ, అక్షింతలను భక్తులకు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీనివాసుల కల్యాణం, పట్టణానికి సమీపంలోని పరమించిపాడు ఆలయంలో నిర్వహించిన పూజల్లో మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు పాల్గొన్నారు.