విపక్షాల వాకౌట్‌ : శాసనమండలి రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : ప్రజా సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పందన రానందుకు మండలి నుంచి విపక్షాలు వాకౌట్‌ చేశాయి. శాసనమండలి రేపటికి వాయిదా పడింది. అంతకు ముందు శాసనమండలిలో సీఎం మాట్లాడుతూ పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు ఈ ఏడాది జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు. ఈ నెల 26న బాబ్లీపై అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. బాబ్లీ అంశంపై శాయశక్తులా పోరాటం చేస్తామని, విపక్షాలు కలిసిరావాలని ఆయన కోరారు. విద్యుత్‌ కోతలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించట్లేదని, గ్యాస్‌ కేటాయింపుల్లో కోతపై ప్రధాని, మొయిలీకి లేఖలు రాశామని చెప్పారు. విద్యుత్‌ సర్‌ఛార్జీలతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. విద్యుత్‌ నియంత్రణ మండలి సిఫార్సు మేరకే సర్‌ఛార్జి వసూలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.