విమలక్క అరెస్ట్‌

హైదరాబాద్‌: గాయని విమలక్కను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. చర్లపల్లి జైలులో ఉన్న తమ కార్యకర్తలతో ములాఖత్‌కు వచ్చిన విమలక్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎందుకు తనను అరెస్టు చేస్తున్నారో చెప్పండని విమలక్క పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం.