వియత్నాం వరదల్లో 16 మంది మృతి

హనోయ్‌:  భారీ వర్షాల కారణంగా వియత్నాంలో వచ్చిన వరదల్లో 16 మంది మృతిచెందారు. మరో 38 మంది గాయపడ్డారు. దేశ ఉత్తర, మధ్య ప్రాంతాల్లో వరద బీభత్సం 3,500 మందికి నిరాశ్రయులను చేసింది. వేలాది హెక్టార్లలో పంటలు, పండ్ల తోటలు నీటి మునిగాయి. ప్రభుత్వం పెద్దఎత్తున సహాయకచర్యలు చేపట్టింది.