వివాహితపై పెట్రోలు పోసి నిప్పంటించిన యువకుడు
చిత్తూరు , జనంసాక్షి: యేర్పేడు మండలం సదాశివపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు వివాహితపై పెట్రోలు పోసి నిప్పటించాడు . ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. దాడికి దిగిన యువకుడికి స్థానికులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.


