విశాఖపట్నంలో విప్రో కార్యాలయం ప్రారంభం

విశాఖపట్నం: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో సంస్థ శనివారం విశాఖపట్నంలో తన కార్యాలయ్నాఇ్న ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం ప్రసగించారు. ప్రముఖ సంస్థ విప్రో విశాఖను ఎంచుకున్న నేపథ్యంలో మిగిలిన సంస్థలు కూడా నగరంలో తన కార్యకలాపాలు ప్రారంభించడానికి అవకాశం ఏర్పడిందన్నారు. విద్యుత్తుకోతలతో విశాఖ ఐటీ రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై సీఎంకు లేఖ రాసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.