విశాఖలో అగ్ని ప్రమాదం :11 ఇళ్లు దగ్థం
వేపగంట ( విశాఖపట్నం): జీవీఎంసీ 69వ వార్డు జడ్పీ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న ఎస్సీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 ఇళ్లు అగ్నికి అహుతయ్యాయి. ఈ ఇళ్లల్లో ఇంటి వెనుక నుంచి ఆకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి గాలితోడవటంతో మిగిలిన ఇళ్లన్నీ కాలిపోయాయి. మర్రిపాలెం , సబ్బవరంల నుంచి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను ఆర్పివేశాయి. సంఘటన స్థలాన్ని పెందుర్తి తహసిల్దారు.. ఎం. వెంకటేశ్వరరావు, జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికార శ్రీనివాసరావు సందర్శంచి ప్రమాదవివరాలను సేకరించారు. ప్రమాద నష్టాన్ని అందచనావేసి బాధితులకు ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాన్ని అందిస్తామని తహసిల్దారు వెంకటేశ్వరరావు తెలియజేశారు. బాధితులకు తాత్కాలిక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని జీవీఎంసీ అధికారులు తెలియజేశారు.