విశాఖలో ఘనంగా వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు

విశాఖ: వివేకానందుని 150వ జయంతి ఉత్సవాలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నడరంలో నిర్వహించిన శోభయాత్రను నగర పోలీసు కమిషనర్‌ శివధర్‌రెడ్డి జెండా వూపి ప్రారంభించారు. పాత జైలు రోడ్డు నుంచి ప్రారంభమైన యాత్ర ప్రధాన రహదారుల గుండా సాగింది. ఈ వూరేగింపులో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఎన్‌సీసీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివేకానంద విగ్రహంతో కూడిన రథం ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.