విశాఖ ఉక్కు పరిశ్రమలో బంద్ వాయిదా
విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమలో శుక్రవారం నుంచి తలపెట్టిన బంద్ వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాలు తెలియజేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో జాప్యం జరిగే సూచనల కనిపిస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు.



