విశాఖ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

share on facebook

 

పర్యాటకంగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఉందన్న మంత్రి

విశాఖపట్టణం,నవంబర్‌ 23 (జనంసాక్షి):  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మంగళవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ రాజధాని విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన నిర్ణయమే తమ నిర్ణయం.. పార్టీ నిర్ణయమని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే విశాఖపట్టణానికి పర్యాటక రంగంగా ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. చాలా కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఇక్కడ పర్యాటక అభివృద్ధి చెందడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొన్ని ప్రాజెక్టులను రోజు పరిశీలిస్తామన్నారు. పర్యాటక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో చర్చించి మరింతగా అభివృద్ధి చేస్తామని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.`

 

 

 

 

Other News

Comments are closed.