విశాఖ స్టీల్‌ప్టాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్టాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను యాజమాన్యం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో అసిస్టేట్‌ మేనేజర్‌ సత్యనారాయణ, టెక్నీషియన్లు సాభాన్‌, ఎస్‌. శ్రీనివాస్‌, కళాసి అనిల్‌ కుమార్‌, కాంట్రాక్ట్‌ కార్మికుడు అప్పరావు ఉన్నారు.