విశ్వ మానవుడు స్వామి వివేకానందా

share on facebook
పరిరక్షణ సమితి దోమ మండల అధ్యక్షులు ప్రతాప్ గౌడ్

 దోమ జనవరి 12(జనం సాక్షి)
భారతదేశ చరిత్రను, సంస్కృతిని ప్రంపచానికి చాటిన స్వామి  వివేకానందుడు అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారని పరిగి నియోజకవర్గ  పరిరక్షణ సమితి దోమ మండల అధ్యక్షులు ప్రతాప్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని పాలేపల్లి గ్రామంలో గురువారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. యువజన సంఘం సభ్యులు వెంకటేష్ మాట్లాడుతూ…లేవండి, మేల్కోండి.గమ్యం చేరేవరకు విశ్రమించకండి, విజయం వరించిందని విర్రవీగకు. ఓటమి ఎదురైందని నిరాశ చెందకు, విజయమే అంతం కాదు, ఓటమి.తుది మెట్టు కాదు. వంటి సూక్తులతో దేశంలోని యువతకు స్పూర్తి ప్రధాతగా నిలిచారని అన్నారు. స్వామి వివేకుని సిద్ధాంతాన్ని, బోధనలను యువతరం పుణికిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోయువజన సంఘ సభ్యులు రాజు,దత్తు, కృష్ణ, రోహిత్, శశి, మహి, మల్లి కార్జున్, రమేష్, నాని, భాను, చిన్న, రామ్ కింగ్, రమేష్, ప్రేమ్ పాల్గున్నారు.

Other News

Comments are closed.