విషం కక్కేందుకే సినిమా తీపిండ్రు:జగదీశ్వర్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంపై విషం కక్కేందుకే ‘కెమెరామెన్ గంగాతో రాంబాబు’ సినిమా తీశారని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి జగధీశ్వర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలనే కుట్రతోనే ఈ సినిమా తీశారని ఆయన దుయ్యబట్టారు. రాంబాబు సినియాను వెంటనే నిలిపివేయాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో డీజీపీ, సీఎంలు స్పందించి వెంటనే చిత్ర పదర్శినను నిలిపివేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు.



