‘వుమెన్ ఇన్ బ్రహ్మణిజం’ చిత్రాన్ని నిషేదించాలి:
హైదరాబాద్: బ్రహ్మణ స్త్రీలను అవమానించేలా చిత్రీకరించిన ‘వుమెన్ ఇన్ బ్రహ్మణిజం’ చిత్రాన్ని నిషేదించాలని బ్రహ్మ సేవా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అశ్లీల దృశ్యాలతో రూపొందించిన ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బ తీస్తుందని బ్రాహ్మణులు డిమండ్ చేస్తున్నాయి. అశ్లీల దృశ్యాలతో రూపొందించిన ఈ సినిమా మా మనోభావాలు దెబ్బ తీస్తోందని బ్రహ్మణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్త్రీలను అసభ్యంగా చూపించిన వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం చిత్రాన్ని నిషేదించాలంటూ తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించటం లేదని ఆంద్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య నాయకులు ద్రోణం రాజు రవికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా రూపకర్తలపై చర్యలు తీసుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని వెల్లడించారు.



