వెయ్యో రోజుకు చేరిన తెలంగాణ రీలే దీక్షలు

సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో మెదక్‌ జిల్లాలోని సిద్ధిపేటలో తెలంగాణ వాదులు చేపట్టిన రిలే దీక్షలు ఈరోజు వెయ్యో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు తెరాస మాజీ ప్రజాప్రతినిధులు వికలాంగులు, వివిధ సంఘాల నేతలు రిలే దీక్ష చేపట్టారు.