వెల్లువెత్తిన అభిమానం..బసపా రాష్ట్ర అధ్యక్షునికి చిత్రపటం బహుకరణ

share on facebook

 

 

మానకొండూరు మండల కేంద్రానికి చెందిన రేణికుంట సుమతి మారుతి దంపతుల కుమార్తె రేణికుంట దివ్య బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు చిత్రపటం బహుకరించి తన అభిమానాన్ని చాటుకుంది. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మానకొండూరుకు చేరుకున్న ఆయనకు చిత్రపటం బహుకరించి తన కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని సంతోషం వ్యక్తం చేసింది. ఉన్నత కొలువు కాదనుకొని ప్రజాసేవకై పరితపించే నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే తనకు ఎంతో అభిమానమంది. ఈ సందర్భంగా దివ్య ను జనం సాక్షి పలకరించగా జువాలజీ లో ఎంఎస్సీ పూర్తి చేశానని, కరీంనగర్ లోని ఆల్ఫోర్స్ లో డిగ్రీ, కిమ్స్ కాలేజీలో పీజీ పూర్తి చేశానని వివరించింది. ప్రస్తుతం టిసిఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలిపింది. యువత చేతుల్లోనే దేశ భవిత ఉంటుందని యువత అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దివ్య కు అభినందనలు తెలిపి గో హెడ్ అని ఆశీర్వదించారు.

Other News

Comments are closed.