వేటపాలెంలో రెండు ఆటోలు ఢీ:బాలుడు మృతి
ప్రకాశం: రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట బ్రిడ్జి వద్ద ఓ లగేజీ ఆటో, ప్రయాణికుల ఆటోను ఒకవైపున ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న జశ్వంత్ కుమార్(7) అనే బాలుడు మృతిచెందాడు. ప్రమాదం జరిగినపుడు లగేజీ ఆటో నడుపుతున్న డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


