వేడుకల్లో విషాదం.. పలు జిల్లాల్లో ఆరుగురి మృతి

అనంతపురం : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పలు జిల్లాల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. వరంగల్‌ జిల్లాలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పడంతో అక్కడికక్కడే చనిపోయారు. కడప జిల్లా చాపాడు మండలం పల్నాడుపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద వేడుకల కోసం కేక్‌ తీసుకువస్తున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు బైక్‌ అదుపుతప్పడంతో దుర్మరణం చెందారు.