వేధింపులు తాళలేక ఇద్దరు మహిళల బలవన్మరణం
అడ్డాకుల : మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సంకలమద్ది గ్రామం బంగ్లాగడ్డ కాలనీలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకెళ్తే.. మణమ్మ (18) అనే మహిళ భర్త పెట్టే వేధింపులను తాళలేక ఇంట్లో కిరోసిన్ పోసుకుని అత్మహత్యకు పాల్పడింది. నాలుగు నెలల క్రితం ఈమెకు వివాహమైంది. మరో ఘటనలో సంధ్య (23) అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మెకు ఏడునెలల పాప ఉంది. భర్త వేధింపులతోనే సంధ్య ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు అడ్డాకుల ఎస్సై కిషన్‌నాయక్ తెలియజేశారు.