వేమన వర్సిటీలో అక్రమాలపై ఏసీబీ విచారణ

కడప, ఆగస్టు 3 : యోగివేమన యూనివర్సిటీ అభివృద్ధి పనుల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఏసీబీ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. యూనివర్సిటీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 2004-2006 సంవత్సరాల్లో ప్రభుత్వం యూనివర్సిటీ అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం అయినందున ఏసీబీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. 2.46 కోట్లు నిధులకు సంబంధించిన బిల్లు లేకుండానే కాంట్రాక్టర్‌ 2.5 కోట్ల నగుదును పొందినట్లు తెలుస్తోంది. వీటన్నింటిపైన ఏసీబీ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది. విచారణలో భాగంగా వైస్‌చాన్సలర్‌ రామచంద్రారెడ్డి, రిజిస్ట్రార్‌ రామకృష్ణారెడ్డిని ఏసీబీ అధికారులు విచారించారు.