వైఎస్ జగన్ లక్ష కోట్లు సంపాదించారు: కేంద్రమంత్రి సర్వే
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షకోట్ల రూపాయలను సంపాదించారని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. దివంగత వైఎస్‌ను నమ్మి సోనియా గాంధీ పీసీసీ ఛీప్ పదవి ,సీఎం పదవి అప్పగిస్తే ,జగన్ ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ దోచుకుని దాచుకున్న డబ్బును పేదలకు పంచి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే వైఎస్ ఆత్మ శాంతిస్తుందని ఆయన అన్నారు.


