వైద్యులపై దాడి చేసిన వారి అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులపై దాడి చేసిన వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తమపై దాడికి నిరసనగా జూనియర్‌ వైద్యులు విధులను బహిష్కరించి సమ్మె చేపట్టడం తెలిసిందే. సమ్మెపై వారు సచివాలయంలో ఉన్నతాధికారులతో చర్చలు జరపనున్నారు.