వైద్యులు గ్రామీణప్రాంతాల్లో సేవలందించాలి : మంత్రి జానారెడ్డి

హైదరాబాద్‌: వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని మంత్రి జానారెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన శ్రేష్ఠ ఛాతీ, వూపిరితిత్తుల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా నిరక్షరాస్యులైన రోగులను గుర్తించి వారికి వైద్యం సట్ల అవగాహన పెంపొందించేందుకు వైద్యులు పాటుపడాలని జానారెడ్డి కోరారు. నిమ్స్‌ మాజీ సంచాలకుడు కాకర్ల సుబ్బారావు పాల్గొని ఆస్పత్రి అభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రి సీఎండీ డాక్టర్‌ శ్యాంసుందర్‌రాజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.