వైద్యులు పూర్తి సమాచారం ఇస్తేనే కొత్త రోగులను చేర్చుకునే అవకాశం: ఆరోగ్యశ్రీ ట్రస్టు
హైదరాబాద్: వైద్యుల సమాచారం ఇవ్వని ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఆరోగ్యశ్రీ సేవల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోగ్యశ్రీ ట్రస్టు పేర్కొంది. వైద్యుల పూర్తి సమాచారాన్ని ఇస్తేనే కొత్త రోగులను చేర్చుకునే అవకాశం ఉంటుందని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1420 మంది వైద్యుల వివరాలు అందాయని ఆరోగ్య శ్రీ ట్రస్టు పేర్కొంది. ప్రైవేటు యాజమాన్యాల వల్లే కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని ట్రస్టు పేర్కొంది.



